అన్నీ ఆడోళ్లకేనా.. మగాళ్లకు 2 మందు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి : మందు బాబులకు ఆ ఎమ్మెల్యే దేవుడయ్యాడు..!

అన్నీ ఆడోళ్లకేనా.. మగాళ్లకు 2 మందు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి : మందు బాబులకు ఆ ఎమ్మెల్యే దేవుడయ్యాడు..!

ఒకే ఒక్కడు.. ఒకే ఒక్క ఎమ్మెల్యే.. దేశం మొత్తంలో మగాళ్లకే కాదు మద్యం ప్రియులకు ఇప్పుడు దేవుడు అయ్యాడు.. ఆ ఎమ్మెల్యేను ఇప్పుడు మందుబాబులకు దేవుడు అయ్యాడు.. సోషల్ మీడియాలో అయితే మీరు ఉండాలి సార్.. మీరు మా టీం కెప్టెన్.. మీలాంటోళ్లో గుండె వెయ్యేళ్లు బతకాలంటున్నారు.. అవును మద్యం ప్రియులకు కొత్తగా దేవుడయిన ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. ఆలస్యం ఎందుకు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

కర్నాటక రాష్ట్రం జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప.. తిరువేకెరె నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ జరుగుతుంది. లిక్కర్ ఆదాయాన్ని 36 వేల కోట్లు నుంచి 40 వేల కోట్ల అంచనాకు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై మాట్లాడారు ఎంటీ కృష్ణప్ప..

మందు బాబులు, మద్యం ప్రియులపై స్పందించారు. లిక్కర్ సేల్స్ అంటే మందుబాబుల నుంచి వసూలు చేస్తున్న డబ్బునే మహిళల ఉచిత బస్సు కోసం ఇస్తున్నారు.. మందు బాబుల నుంచి వసూలు చేస్తున్న పన్నులతోనే మహిళలకు నెలకు 2 వేల రూపాయలు ఫ్రీగా ఇస్తున్నారు.. ఇంత చేస్తున్న మందుబాబులకు ప్రభుత్వం ఏమీ చేయకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వారానికి రెండు బాటిళ్ల మద్యాన్ని ఉచితంగా మందు బాబులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 40 వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న మందుబాబులకు.. వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ ఇస్తే తప్పేంటని చాలా సీరియస్ గా ప్రశ్నించారు జనతాదళ్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప. 

మగాళ్లకు ఎలాగూ డబ్బులు అయితే ఇవ్వలేం.. కనీసం వాళ్ల కష్టానికి.. వాళ్ల త్యాగాలకు గుర్తింపుగా అయినా రెండు మద్యం బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని అసెంబ్లీలోనే డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప. ఉచిత విద్యుత్ మహిళలకే.. ఉచిత బస్సు మహిళలకే.. ఉచితంగా డబ్బులు మహిళలకే.. అన్నీ మహిళలకే ఇస్తే.. అసలు మగాళ్లు ఏం ఇస్తారంటూ నిలదీశారు జనతాదళ్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప. 

ALSO READ | మార్చి 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు.. బ్యాంకు యూనియన్ల సమ్మె.. బ్యాంకులు మూసేస్తారా..?

దీనిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగా స్పందించారు. మీకు అవకాశం వచ్చినప్పుడు అమలు చేద్దురుకానీ ఇప్పుడు కూర్చోడంటూ చురకలు అంటించారు. మద్యం అమ్మకాలను కంట్రోల్ చేయటానికి.. నియంత్రించటానికి ధరలు పెంచాల్సి వస్తుందని.. మద్యం వినియోగం తగ్గించే విధంగా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అయితే కృష్ణప్పపై విరుచుపడ్డారు. మహిళలను అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కష్టం మీకేం తెలుసు అంటూ కృష్ణప్పను తిట్టిపోస్తున్నారు.

వీళ్ల గొడవ ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలోని మందు ప్రియులు మాత్రం జనతాదళ్ ఎమ్మెల్యేకు వీరతాడు వేస్తున్నారు. మీరు గ్రేట్ సార్.. మీరు వెయ్యేళ్లు బతకాలి.. ఆ గుండె బతకాలి సార్.. మగజాతి జాతిరత్నం మీరు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.