గరిడేపల్లి మండలంలో 108 లో గర్భిణి ప్రసవం

గరిడేపల్లి, వెలుగు : 108 లో గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లో వెళ్తే.. గరిడేపల్లి మండలం కుతుబ్షాపురం గ్రామానికి చెందిన మమతకు చెట్లముకుందాపురం గ్రామానికి చెందిన దశరథకు వివాహమైంది. మమతకు మొదటి కాన్పు కావడంతో కుతుబ్షాపురం గ్రామంలోని తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది. శుక్రవారం ఉదయం మమతకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 కి కాల్ చేశారు. 

వెంటనే అక్కడికి చేరుకున్న108 సిబ్బంది సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా దురాజ్ పల్లి వద్ద నొప్పులు ఎక్కుకావడంతో ఈఎంటీ నాగేశ్వరరావు, పైలట్ రషీద్ డెలివరీ చేశారు. అనంతరం తల్లీబిడ్డను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిబీడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.