ఉప్పల్/పద్మారావునగర్, వెలుగు: దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పదని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారని చెప్పారు. శనివారం నాచారంలోని సెయింట్పియూస్ ఎక్స్ డిగ్రీ, పీజీ విమెన్స్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో శ్రీలతప పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరించారు.
కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ అల్ఫోన్స్, ప్రిన్సిపల్ డాక్టర్ వేలంగిని కుమారి, ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుష్మ, స్టూడెంట్లు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ రాజు చెప్పారు. బన్సీలాల్ పేట చాచా నెహ్రూనగర్ రెయిన్ బో హోమ్స్ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. సమర్థంగా ఇంటిని నిర్వహించే మహిళలు, నేడు దేశానికి సారథ్యం వహించే స్థాయికి చేరుకున్నారన్నారు. కార్పొరేటర్ కె.హేమలత, రెయిన్ బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ, బస్తీ మహిళలు పాల్గొన్నారు.