జుట్టు అందంగా .. ఒత్తుగా ఉంటే ఆ బ్యూటీనే వేరు. అందుకే జుట్టును కేశ సంపద అంటారు. జుట్టు పెరగడం ఈ కాలంలో చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. ప్రస్తుతం జుట్టు పెరుగుదల పెద్ద సవాల్ గా మారింది. కానీ కొన్ని టిప్స్ పాలో అయితే చాలు జుట్టు అందంగా, ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుందట. ఇంతకీ జుట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
మహిళలు తరచుగా తమ జుట్టు నడుము వరకు పెరగాలని కోరుకుంటారు. ఒక్క నెలలోనే జుట్టు నడుము వరకు పెరగాలంటే కొన్ని హోం రెమిడీస్ సరిపోతాయని నిపుణులు అంటున్నారు. జుట్టు పెరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యం, కాలుష్యం .. అంతేకాక ఇప్పుడు వాడుతున్న హెయిర్ ఆయిల్స్ కూడా కారణమవుతాయి. అలా కాకుండా కొన్ని హోం రెమిడీస్ తో జుట్టును అందంగా ఒత్తుగా పెంచుకోవచ్చు.
నువ్వులనూనె.. మెంతులు: ఈ రెండు జుట్టుకు ఎంతో పోషణ నిస్తాయి. మెంతి గింజలను వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో నువ్వుల నూనె కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. అరగంట తరువాత తలని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయండి. జుట్టు పొడవు పెరగడంతో పాటు అందంగా ఉంటుంది.
అలోవెరా జెల్ : దీనిని ఆయిల్ ను అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వారానికి మూడు సార్లు అలోవేరా జెల్‌ను రాత్రి సమయంలో జుట్టుకు అప్లై చేసి.. ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చన్నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.
ఉసిరికాయరసం : ఉసిరికాయలను ఎండపెట్టి... దానిని పొడి చేయాలి. ఆ తరువాత దాని నుంచి రసం తీయాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ రసాన్ని తలకు పట్టించాలి. కొబ్బరి నూనె రాసుకున్నట్లు రాసుకోవాలి. ఉసిరికాయ పొడిని కూడా తలకు అప్లై చేయవచ్చు.30 లేదా 45 నిమిషాల తర్వాత చల్లని జుట్టును నీటితో కడగాలి. ఈ సహజ పదార్ధం జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
ALSO READ | Spiritual: వేదాల్లో విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..
కొబ్బరి పాలు : మహిళలు తరచుగా కొబ్బరి పాలను హెయిర్ మాస్క్‌గా ఉపయోగిస్తారు. అయితే, హెయిర్ మాస్క్‌తో పాటు ఉపయోగించాల్సిన అనేక ఇతర పదార్థాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీకు సమయం లేకపోతే కొబ్బరి పాలలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు మసాజ్ చేయండి. మిగిలిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టింస్తే .. జుట్టు మెరుస్తూ ఉంటుంది.
ఉల్లిపాయ రసం : ఇందులో ఉండే సల్ఫర్ ఇందులోని సల్ఫర్ జుట్టుకు చాలా మంచిది. అయితే దీన్ని వాడిన తర్వాత జుట్టు పొడిబారడంతోపాటు గట్టిపడుతుంది. జుట్టు బాగా పెరగాలంటే నిగెల్లా నూనెలో మిక్స్ చేసి అప్లై చేయాలి