మంత్రి కొప్పుల నియోజకవర్గంలో తాగునీటి గోస

జగిత్యాల జిల్లా : మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గమైన ధర్మపురి పట్టణంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వ కాలేజ్ రోడ్డు టు గాంధీ రోడ్డు మధ్యలో నీటి డ్రమ్ములను అడ్డుపెట్టి నిరసన తెలిపారు. నీళ్లు రావడం లేదని మున్సిపాలిటీ అధికారులకు చాలాసార్లు చెప్పినా.. ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమ కాలనీకి నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. కనీసం నీళ్ల ట్యాంకులతో అయినా తాగు నీరు అందించడం లేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి డ్రమ్ములను తీసివేసి.. ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు మహిళలు.