మేడిపల్లి, వెలుగు: తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు కరెంట్స్తంభాలు విరిగిపోయాయి. వాటిని పునరుద్ధరించకపోవడంతో కరెంట్ సప్లై లేక నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా బంద్అయింది.
అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.