నాసిరకం చీరలు మాకెందుకు .. అబ్బాపూర్‌‌‌‌‌‌‌‌లో మహిళల ఆగ్రహం

గొల్లపల్లి, వెలుగు:  నాసిరకం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారంటూ గొల్లపల్లి మండలం అబ్బాపూర్ లో మహిళలు చీరలు తీసుకోకుండా వెనుదిరిగారు. శనివారం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడికి చేరుకున్న మహిళలు ఇలాంటి చీరలు ఎవరైనా కట్టుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోజు కూలికి పోయే తాము ఇంతకన్నా మంచి చీరలు కట్టుకుంటామని మీరిచ్చే ఈ నాసిరకం చీరలు మాకెందుకు అంటూ కింద పడేసి వెళ్లిపోయారు.