- తన లైఫ్‌కి అడ్డొస్తోందని హత్య
- భర్త రెండో భార్యను చంపిన మహిళ
- తమ్ముడితో కలిసి స్కెచ్
- మృతురాలు 6 నెలల గర్భిణి
గచ్చిబౌలి, వెలుగు: తమ లైఫ్‌కి అడ్డొస్తోందని భర్త రెండో భార్యపై మొదటి భార్య కక్ష పెంచుకుంది. తన తమ్ముడితో కలిసి ఆమెను హత్య చేసింది. ఈ ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. ఓల్డ్ సిటీలోని హరిబౌలి ప్రాంతానికి చెందిన భాస్కర్‌కు 2013లో ఇదే ప్రాంతానికి చెందిన జానకి(31)తో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యభర్తలు ఇద్దరూ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్స్. అమీన్పూర్ప్రాంతానికి చెందిన స్రవంతి(32), జానకికి ఫ్రెండ్. స్రవంతి భర్తకి దూరంగా ఉంటోంది. భాస్కర్, జానకితో కలిసి ఆమె కూడా ఈవెంట్స్ కండక్ట్ చేసేది. ఈ క్రమంలో భాస్కర్ కు స్రవంతితో పరిచయం ఏర్పడింది. దీంతో భార్యతో భాస్కర్‌కి తరచూ గొడవలు జరిగేవి. 2018 నుంచి భాస్కర్.. స్రవంతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. దీంతో ఆమె పేరెంట్స్ గతేడాది డిసెంబర్ 23న భాస్కర్, స్రవంతికి పెళ్లి చేశారు. స్రవంతిని భాస్కర్ రెండో పెళ్లి చేసుకునప్పటి నుంచే జానకి ఆమెతో గొడవపడేది. ఏడాది క్రితం జానకి,పిల్లలతో కలిసి భాస్కర్ హరిబౌలి నుంచి రాయదుర్గంలోని పోచమ్మబస్తీకి షిఫ్ట్ అయ్యాడు. స్రవంతి తన లైఫ్ కి అడ్డొస్తోందని జానకి ఆమెపై కక్ష పెంచుకుంది. తన తమ్ముడు గుండా లక్ష్మినారాయణ కృష్ణ ప్రసాద్ తో కలిసి స్రవంతిని మర్డర్ కి ప్లాన్ వేసింది.
మాట్లాడుకుందామని పిలిచి..
శుక్రవారం జానకి స్రవంతికి కాల్ చేసి రాయదుర్గంలోని తన ఇంటికి రావాలని చెప్పింది. గర్భిణిగా ఉన్న స్రవంతి హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నట్టు ఇంట్లో పేరెంట్స్ కి చెప్పింది. అప్పటికే జానకి ఇంట్లో ఉన్న భర్త భాస్కర్ కు టీలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపి ఇవ్వడంతో అతడు మత్తులోకి వెళ్లాడు. ఉదయం 10.30 గంటలకు జానకి ఇంటికి స్రవంతి వచ్చి మాట్లాడుతోంది. ఈ క్రమంలో జానకి, కృష్ణప్రసాద్ కలిసి స్రవంతి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి ఆమె మొహంపై దాడి చేశారు. స్రవంతి అక్కడిక్కడే చనిపోయింది. హాస్పిటల్ కి వెళ్లిన తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో స్రవంతి పేరెంట్స్.. భాస్కర్ కి కాల్చేశారు. మత్తు నుంచి తేరుకున్న భాస్కర్ సాయంత్రం రాయదుర్గం పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. భాస్కర్ పీఎస్ లో ఉండగానే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి స్రవంతిని మర్డర్ చేసినట్లు భాస్కర్ కు చెప్పాడు. భాస్కర్ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. నిందితులు కృష్ణప్రసాద్ తో పాటు జానకిని అరెస్ట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ రవీందర్ తెలిపారు.
For More News..