సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు సైబర్ చీటర్స్ టోకరా

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు సైబర్ చీటర్స్ భారీగా టోకరా చేశారు. కామారెడ్డి మండలం షాబ్దిపూర్ గ్రామానికి చెందిన సుప్రద అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు DTDC కొరియర్ డి ఆక్టివేట్ అయిందని.. ఆక్టివేషన్ కొరకు డబ్బులు పంపాలంటూ సూచించారు సైబర్ నేరగాళ్లు. సుప్రద మొబైల్ కు ఓ లింకును పంపి రూ.5 పంపించాలని సూచించారు. 

దీంతో లింక్ ఓపెన్ చేయగానే  సుప్రద అకౌంట్ నుంచి 71,300 వేలు డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మేస్సేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సుప్రద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.