
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో మహిళల మంగళ సూత్రాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ హయాంలో మహిళలు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చిందన్నారు. 2
019 నుంచి 2024 మధ్య 4 కోట్ల మంది మహిళలు తమ బంగారం తాకట్టు పెట్టి రూ.4.7 లక్షల కోట్ల రుణం తీసుకున్నారని మీడియా రిపోర్టులు వెలువడటంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో మహిళలు తీసుకున్న మొత్తం రుణాలలో 38% బంగారాన్ని తాకట్టు పెట్టడం ద్వారానే వచ్చాయని చెప్పారు.
ఒక ఏడాదిలో బంగారు రుణాలు 71.3% పెరిగాయని ఇటీవల ఆర్బీఐ డేటా వెల్లడించిందన్నారు.