చక్కని ఆకృతుల్లో గోళ్లు, నాజూకైన వేళ్లూ అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అమ్మాయిలు పెడిక్యూర్, మానిక్యూర్ అంటూ.. బ్యూటీ పార్లర్స్ కి వెళ్తారు. కానీ పార్లర్ పనిలేకుండా ఇంట్లోనే గోళ్లను ఆరోగ్యంగా, అందంగా చేసుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందాం. . .
సాధారణంగా బట్టలు ఉతకడం.. గిన్నెలు తోమడం వల్ల గోళ్లు ఎక్కువుగా పాడవుతాయి. కొన్నిసార్లు విరిగిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే బట్టలు ఉతికిన తర్వాత, గిన్నెలు కడిగిన తర్వాత చేతులకు మాయిశ్చ రైజర్ రాసుకుని మర్దనా చేయాలి.
ALSO READ | Women Beauty : ఈ పండ్లతో ఫేస్ మసాజ్.. ఆ తర్వాత మీ ముఖం నిగనిగలాడుతోంది..!
ఇలా చేయడం వల్ల గోళ్లకు తేమ అంది మృదువుగా విరిగిపోతున్నాయంటే పౌష్టికాహార లోపమని అర్దం. అందుకే ఆహారంలో ఆకుకూరలు. గుడ్లు, బీన్స్, మొలకలు లాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజూ రాత్రిపూట గోరు వెచ్చని నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, కొద్దిగా బాదం నూనె వేసి గోళ్లను కాసేపు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు విరగవు, కాళ్లూ, చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా గోర్లు పాడవుతాయి.
అందువల్ల కాళ్లు చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. బాదం నూనెలో పంచదార కలిపి చేతిగోళ్లకు రాసి రోజూ పది నిమిషాల మర్దనా చేస్తే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గోరు వెచ్చని పాలు, పంచదార, తేనె మిశ్రమంతో ఇలా చేసినా మంచిదే నని నిపుణులు చెబుతున్నారు.
-వెలుగు.. లైఫ్--