హైదరాబాద్​ లో వావ్ వుమన్ ఆన్ వీల్స్ ట్రెజర్ హంట్‌  కార్యక్రమం

మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు హైదరాబాద్​ లో  వావ్ వుమన్ ఆన్ వీల్స్ ట్రెజర్ హంట్‌  కార్యక్రమం జరిగింది.  జితో లేడీస్​ వింగ్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 జట్లు పాల్గొన్నాయి.  ఆబిడ్స్​లోని సెయింట్​ జార్జ్​ గ్రామర్​ స్కూల్​ నుంచి ప్రారంభమై.. నగరంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ సికింద్రాబాద్​క్లబ్​ లో ముగిసింది.    మహిళా సాధికారత, మహిళలపై హింసను నిర్మూలించడం యొక్క ప్రాముఖ్యత గురించి... అవగాహన పెంచడానికి ఈ ట్రెజర్ హంట్ రూపొందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 

అవగాహన ప్రచారం చేయడం...  హింసకు వ్యతిరేకంగా చర్యలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. మహిళల కోసం సురక్షితమైన... సాధికారత కలిగిన సమాజాన్ని రూపొందించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత, సాధికారతతో పాటు... హింస రహిత సమాజాన్ని సృష్టించే దిశగా ఒక అడుగు వేసినట్లు పేర్కొన్నారు. సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు,అత్యాచారాల చిత్ర పటాలను కార్లపై  ప్రదర్శిస్తూ...అఘాయిత్యాలపై నృత్యరూపంగా ప్రజలకు అవగాహన కల్పించారు.