ఆది శ్రీనివాస్​ను గెలిపించినందుకు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించిన మహిళలు

వేములవాడ, వెలుగు: వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్‌‌‌‌ విజయం సాధించడంపై పలువురు మహిళలు శనివారం పాదయాత్రగా వచ్చి రాజన్నను దర్శనం చేసుకొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన సుమారు 25 మంది మహిళలు  తెల్లవారుజామున బయలుదేరి సుమారు 20 కిలోమీటర్లు నడిచి రాజన్న సన్నిధికి చేరుకున్నారు.

పూజల అనంతరం వారు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్‌‌‌‌ ఎమ్మెల్యేగా గెలిచినందుకు రాజన్నకు మొక్కులు చెల్లించామన్నారు.