గ్రేటర్​ వరంగల్ ​సంక్షేమంలో మహిళలది కీలక పాత్ర

కాశీబుగ్గ, వెలుగు:  గ్రేటర్​ వరంగల్ ​సంక్షేమంలో మహిళలలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొండా సురేఖ, సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. బల్దియా మేయర్​ పీఠంలో కూడా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్​గా మసూద్​ రిజ్వానా షమీమ్​ రాణిస్తున్నారు.మరోవైపు హనుమకొండ, వరంగల్​, ములుగు జిల్లాలకు కలెక్టర్లుగా సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, ఇలా త్రిపాఠి పాలనాధికారాలు నిర్వహిస్తున్నారు.  రాజకీయ, సామాజిక, విద్య, వైద్య, పోలీసు, రంగాల్లో మహిళలు సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారనడానికి ఉమ్మడి జిల్లా ఉదాహరణగా నిలుస్తోంది.