బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ మహిళలు ఆడిపాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం మహిళలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం, పానగల్ అర్బన్ హాస్పిటల్, జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో బతుకమ్మ పండుగ కీలకమన్నారు. సహజసిద్ధంగా లభించే పూలను చెరువులు, కాల్వలు, నదిలో నిమజ్జనం వల్ల నీరు శుభ్రంగా మారుతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకలను అందరూ కలిసి చేసుకోవడంతో ఐక్యమత్యం పెరుగుతుందన్నారు. - వెలుగు నెట్​వర్క్​