మా అభిప్రాయం తీసుకోకుండా  ఎలా ప్రకటిస్తరు?

మా అభిప్రాయం తీసుకోకుండా  ఎలా ప్రకటిస్తరు?

సంగారెడ్డి(హత్నూర), వెలుగు : తమ అభిప్రాయం తెలుసుకోకుండా నర్సాపూర్  ప్రజా ఆశీర్వాద సభలో దౌల్తాబాద్, కాసాలను కలిపి మున్సిపాలిటీ చేస్తామని సీఎం కేసీఆర్  ద్వారా ప్రకటన చేయించడంపై బీఆర్ఎస్  అభ్యర్థి సునీతా రెడ్డి, మదన్ రెడ్డి లపై కాసాల గ్రామస్తులు మండిపడ్డారు. శనివారం నర్సాపూర్  బీఆర్ఎస్  అభ్యర్థి సునీతా రెడ్డి ప్రచార రథాన్ని గ్రామస్తులు అడ్డుకొని నిరసన తెలిపారు.

తమ అభిప్రాయం తెలుసుకోకుండా రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ప్రచార రథాన్ని ఊర్లో తిరగనివ్వబోమని చెప్పారు. సునీతా రెడ్డి ప్రచారానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం గ్రామ వీధుల తిరుగుతూ ‘మున్సిపాలిటీ వద్దు, పంచాయతీ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ గ్రామ యువకులు ర్యాలీ నిర్వహించారు.