అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామం లో శనివారం మిషన్ భగీరథ వాటర్ సరఫరా కాకపోవటంతో మహిళలు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు గ్రామం కావడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని మహిళలు భీష్మించు కూర్చున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎస్సై శ్రీరాముల శ్రీను తాగునీటి సమస్య తలెత్తకుండా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మోటార్లు రిపేర్ అయ్యే వరకు గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పడంతో మహిళలు ధర్నా విరమించారు.