కరీంనగర్లో ఖాళీ బిందెలతో మహిళల నిరసన

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సచివాలయం ముందు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత పది రోజుల నుంచి మంచినీళ్ల రావడం లేదని ఆందోళన దిగారు గ్రామ మహిళలు. అయితే నాలుగు ఏళ్లుగా పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఉదయం వచ్చునూరు గ్రామ చెందిన మహిళలు బిందెలతో రోడుపై బైఠాయించారు.

సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం సరికాదని, తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంచినీరు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఈ నిరసనను మండల స్థాయికి తీసుకెళ్తామని మహిళలు హెచ్చారించారు.