
కౌడిపల్లి, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మండలంలోని మహమ్మద్ నగర్ లో ఎస్సీ కాలనీ మహిళలు గ్రామపంచాయతీ వద్ద శనివారం ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నల్లా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు నీటి సమస్యపై గ్రామపంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయకుంటే ఎంపీడీవో ఆఫీసు ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.