జగదేవపూర్ లో తాగునీటి కోసం మహిళల ధర్నా

జగదేవపూర్, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మండలంలోని ఇటిక్యాలలో శనివారం జరిగింది. పలువురు మహిళలు మాట్లాడుతూ పదిహేను రోజులుగా మిషన్ భగీరథ  నీళ్లు రావడంలేదని, తాగునీటికి నానా తంటాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

పలుమార్లు సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టి తీసుకపోయినా ఫలితం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మిషన్ భగీరథ అధికారులు గ్రామానికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏఈ హామీతో మహిళలు నిరసనను విరమించారు.