ఆసిఫాబాద్, వెలుగు: బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వాంకిడి మండలం గోయగాం గ్రామానికి చెందిన మహిళలు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటుచేసి మద్యం విక్రయిస్తున్నారని, దీంతో యువత మద్యానికి బానిసై తరచూ గొడవలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలోని బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ కు వినతిపత్రం అందజేశారు.