
నిజాంపేట, వెలుగు: మెదక్జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నష్కల్గ్రామంలో ఎస్సీ కాలనీ మహిళలు మూడు నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నీళ్ల సమస్య పరిష్కరించాలన్నారు.