న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది.. కొందరు యువకులు మద్యం మత్తులో కారు నడుపుతూ స్కూటీని ఢీ కొట్టారు. స్కూటీతో పాటు కిందపడ్డ యువతిని 4 కిలోమీటర్లు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
3.30 గంటలకు ఫోన్ కాల్..
ఆదివారం వేకువజామున దాదాపు 3.30 గంటల సమయంలో కాన్ ఝ్వాలా పోలీసు స్టేషన్‌కు ఒక కాల్ వచ్చింది. గ్రే కలర్ బలెనో కారు కుతుబ్ ఘర్ వైపుగా ఒక యువతిని ఈడ్చుకుపోతోందని ఫోన్ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ ఏరియాలోని చెక్ పాయింట్లను పోలీసులు అలర్ట్ చేశారు. అరగంట తర్వాత రోడ్డుపై పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం కోసం ఎస్జీఎం హాస్పిటల్ కు పంపించారు.
కారు సీజ్.. ఐదుగురు అరెస్టు
ఈ ఘాతుకానికి పాల్పడిన కారు ఓనరు వివరాలను పోలీసులు గుర్తించి.. అందులో ప్రయాణించినట్లుగా భావిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు.
ఫంక్షన్లో పనిచేసి ఇంటికి వెళ్తుండగా.. మృతిచెందిన యువతి స్కూటీని సుల్తాన్‌పురి ఎస్ హెచ్‌వో గుర్తించారు. ఆ యువతి పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పార్ట్ టైంవర్క్ చేస్తోందని పోలీసులు తెలిపారు. శనివారం ఒక ఫంక్షన్లో పనిచేసి స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగిందన్నారు.