సంగారెడ్డి టౌన్, వెలుగు: తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ పోలీస్కానిస్టేబుల్స్సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఉమెన్సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్శిక్షణ కేంద్రంలో ఐదు జిల్లాలకు చెందిన ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ ఔట్పరేడ్కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 9 నెలల శిక్షణ అంశాలు విధి నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయని ఎప్పటికీ మరిచిపోవద్దన్నారు. పోలీసింగ్ అనేది నిరంతర శిక్షణ ప్రక్రియ అని సమాజంలో జరిగే నేరాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
వందశాతం రిజల్ట్ తీసుకురావడంలో కృషి చేసిన డీటీసీ ప్రిన్సిపాల్, టీచింగ్ స్టాఫ్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్క్రాంతి, ఎస్పీ రూపేశ్మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కానిస్టేబుల్స్ పాత్ర కీలకమన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలన్నారు.
అనంతరం శిక్షణ కాలంలో ప్రతిభ కనబరిచిన వారికి డీఐజీ రెమా రాజేశ్వరి బహుమతులు అందజేశారు. అడిషనల్ఎస్పీ సంజీవరావు, డీటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, డీఎస్పీలు, సీఐలు, ట్రైనీ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.