![మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : కౌన్సిలర్ గౌతమి](https://static.v6velugu.com/uploads/2025/02/women-should-excel-in-all-fields-says-centre-councillor-gauthami_GKymnLtPVe.jpg)
కోరుట్ల, వెలుగు: మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి, అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా మహిళ సాధికారిత కేంద్రం కౌన్సిలర్ గౌతమి, సైకాలజిస్ట్ గౌతమ్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికార కేంద్ర బృందం నిర్వహిస్తున్న బేటి బచావో- బేటి పడావోలో భాగంగా కోరుట్ల పట్టణంలోని గర్ల్స్ జడ్పీ హైస్కూల్, మోహన్‌రావుపేట జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ప్రేరణ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో పట్టు సాధించి సమజాభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు భారతి, షామీన్ సుల్తానా, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది మానస, మహిళా సాధికారత సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.