మహిళలు సవాళ్లను అధిగమించాలి : అడిషనల్ కలెక్టర్ విద్యాచందన 

మహిళలు సవాళ్లను అధిగమించాలి : అడిషనల్ కలెక్టర్ విద్యాచందన 

పాల్వంచ, వెలుగు : సమాజంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను మహిళలు సమర్థంగా ఎదుర్కోవాలని అడిషనల్ కలెక్టర్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన అన్నారు. జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆటల పోటీలను ప్రారంభించారు.

విద్యార్థులు, సిబ్బందికి మహిళా దినో త్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అసోసియేష న్ మహిళా విభాగం, జిల్లా ప్రభు త్వ డిగ్రీ కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.