మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి :  కలెక్టర్ అభిలాష అభినవ్ 

మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి :  కలెక్టర్ అభిలాష అభినవ్ 

 నిర్మల్, వెలుగు:  మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు.  మార్చి 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రా రంభించారు. బేటి బచావో బేటి పడావో, మహిళా సాధికారిక నినాదాలతో ర్యాలీని నిర్వహించారు.

ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళ లం దరూ స్వశక్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు.   స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి (జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్) జి. రాధిక, ఆర్డిఓ రత్న కళ్యాణి, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎసి డిపిఓ లు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, మెప్మా పీడీ సుభాష్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మిషన్ శక్తి కో, ఆర్డినేటర్ సరిత, ఎస్ హెచ్ జి మహిళలు, ఎన్ సిసి విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు, ఎఎన్ఎం, ఆశాలు,  మహిళలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.