అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు.2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని మహిళలు అబార్షన్ పిల్స్ పెద్ద ఎత్తున కొనిపెట్టుకుంంటున్నారట. ఇప్పుడు అమెరికాలో హార్ట్ టాపిక్..
అమెరికాలో 2022 నుంచి అబార్షన్ చట్ట విరుద్ధం..2019లో బైడెన్ ప్రభుత్వం వచ్చాక.. అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో అబార్షన్ నిషేధించబడింది. అయితే అబార్షన్ నిషేధ చట్టాన్ని ఎత్తివేస్తానని 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మహిళలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్ గెలిచారు. మరో రెండు నెలల్లో 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో అమెరికన్ మహిళలు కొత్త అధ్యక్షుడి వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడని ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
ఊహించిన దానికంటే యునైటెడ్ స్టేట్స్ అంతటా మహిళలు గర్భనిరోధక మాత్రలు, అబార్షన్ మందులు కొనిపెట్టుకుంటున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అబార్షన్ పిల్స్ సరఫరాలో భారీగా డిమాండ్ పెరిగిందని అమెరికాకు చెందిన అబార్షన్ పిల్స్ సరఫరా చేసే అతిపెద్ద కంపెనీ ఎయిర్ యాక్సెస్ చెపుతోంది. ట్రంప్ ను విజేతగా ప్రకటించిన 24 గంటల్లోనే అబార్షన్ పిల్స్ కోసం 10వేల ఆర్డర్లు వచ్చాయంటే డిమాండ్ ఎంతుంతో చెప్పవచ్చు. ఇది సాధారణ రోజువారీ అమ్మకాలకంటే 17 రెట్లు ఎక్కువ.
ALSO READ | ప్రపంచం అంతా అమెరికాలో ఏం జరుగుతుందో చూస్తుంటే.. అమెరికన్లు మాత్రం అదే చూశారు..!
అబార్షన్ మందుల సమాచారాన్ని అందించే ప్లాన్ సి అనే సంస్థ.. తన వెబ్‌సైట్‌కు 82,200 మంది చూసినట్లు తెలిపింది. ఇది ఎన్నికల ముందు కంటే అనూహ్యమైన పెరుగుదల.. ఎన్నికల ముందు రోజుకు 4వేల నుంచి 4వేల500 మాత్రమే తమ వెబ్ సైట్ ను చూసేవారని తెలిపింది.
ట్రంప్ ప్రెసిడెన్సీలో ప్రజలు ఆశించే అబార్షన్ పై నిషేధం ఎత్తి వేస్తారని అందుకు సిద్దమయితున్నట్లు ఇది సంకేతమని ప్లాన్ సి సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రెసిడెంట్ గా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్..అమెరికన్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా.. అబార్షన్ నిషేధ చట్టాన్ని రద్దు చేస్తారా వేచి చూడాలి