భారతదేశంతో సహా 50 దేశాలకు చెందిన పదిహేను అధ్యయనాల ఫలితాల ప్రకారం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహిళలు చికిత్స సమయంలో దారుణమైన ఫలితాలను అనుభవిస్తారు. వాంతులు, దవడ నొప్పి, పొత్తికడుపు నొప్పితో సహా అదనంగా ఛాతీ నొప్పి వంటి లక్షణాలతో స్త్రీలు ఎదుర్కొంటారని పరిశోధకులు గుర్తించారు.
ఈ తరహా లక్షణాలను ఎదురైనప్పుడు, రోగ నిర్ధారణ, చికిత్సలు ఆలస్యం అవుతాయని పరిశోధకులు చెప్పారు.
"హృదయ సంబంధ వ్యాధుల నిర్ధారణ, చికిత్స, లక్షణాలను గుర్తించడంలో పురుషులు, స్త్రీల మధ్య చాలా వ్యత్యాసాలను కనుగొన్నాము" అని యూఎస్‌లోని మసాచుసెట్స్ లోవెల్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ మహదీ ఓ. గారెల్‌నాబి అన్నారు. "రోగ లక్షణాలు ప్రారంభమైన తర్వాత స్త్రీలు పురుషుల కంటే ఆలస్యంగా ఆసుపత్రికి వెళతారు. వైద్యులు పురుషుల మాదిరిగానే మహిళలను ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు" అని గారెల్నాబి చెప్పారు.
ఆర్టెరియోస్క్లెరోసిస్, థ్రాంబోసిస్, వాస్కులర్ బయాలజీ అనే జర్నల్‌లో ప్రచురించబడిన విశ్లేషణ ప్రకారం, యువ మహిళల్లో గుండెపోటు రేట్లు పెరుగుతున్నాయి. పరిశోధకుల ప్రకారం, అదే సమయంలో పురుషుల రేటు 30 నుంచి 33 శాతానికి పెరిగింది. "యువ మహిళల్లో గుండెపోటు రేట్లు పెరుగుతుండటం ఆందోళనకరం" అని గారెల్నాబి అన్నారు. "మహిళలకు ప్రత్యేకమైన ప్రమాద కారకాలైన అకాల మెనోపాజ్, ఎండోమెట్రియోసిస్, గర్భధారణ సమయంలో రక్తపోటు రుగ్మతలు" అని ఆయన చెప్పారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండియా, అరేబియా గల్ఫ్ దేశాలు, యూఎస్‌తో సహా 50 దేశాల నుంచి పదిహేను అధ్యయనాల ఫలితాల ఆధారంగా ఈ ఫలితాలు కనుగొనబడ్డాయి.