
గుంటూరులో జరుగుతున్న వరుస చోరీలతో నగరవాసులకు కంటిపై కునుకు కరువైంది. పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న చోరీలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు నిఘా వర్గాల హెచ్చరికలతో అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. అరండల్ పేటలో అనుమానంగా సంచరిస్తున్న కొంతమంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై వాహనాలను ఆపి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పాద చారులను ఇబ్బందులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దొంగల ముఠాలో ఎంతమంది ఉన్నారు.. ఇంకా ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడుతున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రాజస్తాన్ నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన మహిళల ముఠాగా పోలీసులు గుర్తించారు.