కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మహిళా వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పోస్టులకు వారు రాజీనామా చేశారు. నియొజకవర్గంలో సంక్షేమపథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్న 1200 మంది వాలంటీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 నెలలుగా అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలను నిస్వార్ధంగా అందిస్తున్నామని రాజీనామా లేఖలో తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ విధులను నిర్వహిస్తున్నామన్నారు. అయినా కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి.. వేధిస్తున్నారని వాలంటీర్లు ఆరోపించారు. ఈ క్రమంలో మచిలీపట్నం నియోజకవర్గంలో 1200 మంది మహిళా వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసేశారు.
నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వాలంటీర్లు అనితరమైన సేవలు అందిస్తున్న వాలంటీర్లను .. ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి ఈసీ దూరం చేసినందుకు మనస్థాపంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌కు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. కొంతమంది వాలంటీర్లు గ్రామ సచివాలయాల్లో తమ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొంతమంది రాజకీయ నేతలు కక్ష సాధింపు చర్యగా... . ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం, హైకోర్టుకు వెళ్లడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను తీసివేయాలని కుట్రలు చేశారు. వాలంటీర్లపై . నిందలు వేశారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను మర్చిపోయిన దుర్మార్గులు ... 1వ తేదీన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, పేదల ఆశలపై గొడ్డలి వేటు వేశారు.