ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు, మహిళా మండలి నాయకుల మధ్య నెలకొన్న గ్రామ గ్రంథాలయ స్థలం గొడవ తారా స్థాయికి చేరింది. గ్రామస్తుల  కోరడంతో గతంలో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి గ్రామ గ్రంథాలయాభివృద్ధికి రూ. 30 లక్షలు శాంక్షన్​చేశారు.  అయితే కొందర వ్యక్తులు మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి గ్రంథాలయ స్థలంలో మహిళా సమాఖ్య భవనం కట్టాలని డిమాండ్​తెరపైకి తెచ్చారు.  దీనిని గ్రామస్తులు వ్యతిరేకించారు. అధికారులు కల్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 16 రోజులైనా సమస్య పరిష్కరించడం లేదంటూ శుక్రవారం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.   వెంటనే సమస్యలు పరిష్కరించకుంటే  ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. సమస్య తెలుసుకున్న పోలీ సులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని  మహిళలతో మాట్లాడి వారిని టవర్​పై నుంచి కిందికి దించారు.

అయ్యప్ప ఆగ్రహం

అయ్యప్ప పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్​ను వెంటనే అరెస్ట్​ చేయాలని అయ్యప్ప మాలధారులు డిమాండ్ ​చేశారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  స్వాములు  ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం కలెక్టర్, పోలీసులు, జిల్లా , మండల అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. ఎవరైనా.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.  హిందువుల ఆరాధ్య  దేవుళ్లు  అయ్యప్ప, శ్రీ రాముడు, శివుడిపై నరేశ్ వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. - – నెట్​వర్క్​, వెలుగు

ఎంపీ ఫండ్స్ నుంచి నిధులు మంజూరు

నిజామాబాద్, వెలుగు:  బాల్కొండ నియోజకవర్గంలోని తాళ్ల రాంపూర్‌‌, మెండోర, భీంగల్‌‌, కారేపల్లి గ్రామాల్లో  వివిధ అభివృద్ధి పనుల కోసం ఎంపీ అర్వింద్‍ తన కోటా నిధులు రూ.14.95 లక్షలు శాంక్షన్​చేశారు.  సంబంధిత పేపర్లను శుక్రవారం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు అం దించారు.  డాక్టర్‌‌ ఏలేటి మల్లికార్జున్‌‌ రెడ్డి,  బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్​ మల్కన్నగారి మోహన్‌‌ రెడ్డి,  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌‌, నాయకులు పాల్గొన్నారు. 

నకిలీ ఏజెంట్లను ఎన్ కౌంటర్ ​చేయాలి

ఆర్మూర్, వెలుగు : కంపెనీ వీసా పేరుతో గల్ఫ్ పంపి, అక్కడ విజిట్​వీసా అంటగట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్ నకిలీ ఏజెంట్లను ఎన్​కౌంటర్​చేయాలని ప్రవాస భారతీయుల హక్కులసంక్షేమ వేదిక ప్రెసిడెంట్​ కోటపాటి నరసింహం నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్ లో ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులతో కలిసి  మీడియా సమావేశంలో మాట్లాడారు. గల్ఫ్ బాధితులకు న్యాయం చేయాలని ఇండియన్ ఎంబసీకి, పోలీస్ శాఖకు  కంప్లయింట్​చేసినట్లు తెలిపారు. ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి పర్మినెంట్ జాబ్ ఇప్పించకుండా మోసం చేస్తుండడంతో తిరిగి రాలేక అక్కడే నందిపేట్, సిరికొండ మండలానికి చెందిన పలువురు యువకులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1.20 లక్షలు ఫైన్​కడితేనే పంపిస్తామని అక్కడి ఆఫీసర్లు చెప్పటంతో , అక్కడి ఇండియన్  ఎంబసీలో అప్లై చేసుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేక ఆందోళన చెందుతున్నార చెప్పారు. వందలాది మంది యువకులను మోసగించిన నకిలీ ఏజెంట్​చిక్కెల స్వామిని అరెస్ట్​ చేసి బాధితులను ఇండియాకు రప్పించాలన్నారు.  

నిబంధనలు పాటిస్తూ సెలబ్రేషన్స్​ జరుపుకోవాలి:  సీపీ నాగరాజు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్​ పోలీస్​ రూల్స్​ పాటిస్తూ జరుపుకో వాలని నిజామాబాద్​సీపీ నాగరాజు సూచిం చారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమని చెప్పారు. వెహికల్స్​ ఓవర్​స్పీడ్​తో నడుపొద్దని, 31 రాత్రి జిల్లా వ్యాప్తంగా స్పెషల్​డ్రైవ్​లు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగొద్దని,  వెహికల్స్​తో ర్యాలీగా వెళ్లొద్దన్నారు.  ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వారి తల్లిదండ్రులు మైనర్లకు బైక్లు  ఇవ్వొద్దని సీపీ సూచించారు. కరోనా అలర్ట్​లో భాగంగా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిందన్నారు.  

తాగిన మత్తులో సర్పంచ్​పై దాడి

  ఇద్దరు యువకుల అరెస్ట్​

భిక్కనూరు, వెలుగు: తాగిన మత్తులో సర్పంచ్​పై దాడి చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్​చేశారు. ఎస్సై గాంధీగౌడ్​వివరాల ప్రకారం.. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల చందు, వడ్ల ప్రతిన్ ​అనే ఇద్దరు యువకులు ఫుల్​గా తాగి మండల కేంద్రంలోని బద్రి అనే వ్యక్తికి చెందిన  సిమెంట్​బెంచ్​ను పగలగొట్టి హంగామా చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్​అక్కడికి చేరుకుని ‘ఎవరు మీరు..? ఏ ఊరు.. ఎందుకు బెంచిని పగలగొట్టారు’ అని ప్రశ్నించగా.. ఎవరైతే నీకేంటని సర్పంచ్​ కాలర్​ పట్టుకుని దాడి చేశారు. స్థానికులు అడ్డుకుని  పోలీసులకు ఫోన్​చేయడంతో ఇద్దరు యువకులకు డ్రంకెన్​ టెస్టు చేసి, అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.