- అందులో 3 అన్రిజర్వ్డ్ వార్డులోనూ విన్
- టీఆర్ఎస్లో 28 మంది.. బీజేపీలో 26 మంది విజయం
- కాంగ్రెస్లో గెలిచిన ఇద్దరూ మహిళలే..
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మహిళా పొలిటీషియన్లు సత్తా చాటారు. 78 డివిజన్లలో గెలిచారు. టీఆర్‌ఎస్ నుంచి 28 మంది మహిళా నేతలు విజయం సాధించారు. బీజేపీ నుంచి 26 మంది, ఎంఐఎం నుంచి 21 మంది గెలిచారు. కాంగ్రెస్కు మొత్తంగా రెండు సీట్లు దక్కగా.. ఆ రెండింటిలోనూ మహిళలే గెలవడం గమనార్హం. ఆ పార్టీ నుంచి ఉప్పల్ డివిజన్‌లో ఎం.రజిత, ఏఎస్ రావు నగర్ డివిజన్‌లో శిరీషారెడ్డి విజయం సాధించారు. ఇక అన్రిజర్వ్డ్ స్థానాల్లో ముగ్గురు మహిళలు గెలుపొందారు. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మెహన్ భార్య శ్రీదేవి యాదవ్..చర్లపల్లిలో, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి.. బంజారాహిల్స్లో, దేదీప్యరావు వెంగళరావ్‌నగర్‌లో విన్ అయ్యారు. ఈ ముగ్గురూ మేల్ లీడర్లతో తలపడి గెలిచారు. ఇక నేరెడ్‌మెట్ డివిజన్ మహిళలకే కేటాయించగా, అక్కడ బీజేపీ, టీఆర్‌ఎస్ లీడర్ల నడుమ హోరాహోరీ పోరు జరిగింది. ఓట్ల లెక్కింపులో జరిగిన పొరపాటుతో ఆ డివిజన్ ఫలితాన్ని అధికారులు ప్రకటించలేదు.