Women's Asia Cup 2024: మహిళల ఆసియా కప్.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Women's Asia Cup 2024: మహిళల ఆసియా కప్.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

మహిళల ఆసియా కప్ తొమ్మిదో ఎడిషన్ కు రంగం సిద్ధమైంది. జూలై 19 నుంచి జరగనున్న ఈ టోర్నీ జూలై 28 తో  ముగుస్తుంది. టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిధ్యమిస్తుంది. మొత్తం ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నీని రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. గ్రూప్‌‌‌‌–ఎలో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూప్‌‌‌‌–బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌, మలేసియా జట్లు ఉన్నాయి.

ఆసియన్ దేశాలు తలపడే ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మంగళవారం(జులై 16) శ్రీ‌లంక‌కు బయలుదేరి వెళ్లింది. టోర్నమెంట్‌లో గ్రూప్ ఏ లో ఉన్న భారత్ టోర్నమెంట్‌లో తమ తొలి మ్యాచ్‌ను జూలై 19న పాకిస్థాన్‌తో ఆడనుంది. జూలై 21న యూఏఈ తో.. జూలై 23న నేపాల్‌తో తలపడుతుంది. టోర్నీలో మొత్తం 15 మ్యాచ్ లు జరుగుతాయి. మ్యాచ్ లన్ని దంబుల్లాలోని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.

ఇప్పటివరకు మహిళల ఆసియా కప్ 8 సార్లు జరిగింది. భారత జట్టు రికార్డ్ స్థాయిలో ఏడు సార్లు టైటిల్ అందుకుంది. బంగ్లాదేశ్ ఖాతాలో ఒక ఆసియా కప్ ఉంది. ఈ టోర్నీలో పాకిస్థాన్, శ్రీలంక ఒక్కసారి కూడా గెలవలేదు. మహిళా ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. జూలై 19 నుండి ప్రతిరోజూ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఒక మ్యాచ్.. సాయంత్రం 7 గంటలకు మరో మ్యాచ్ జరుగుతుంది.

Also Read :- యువ క్రికెటర్లకు శుభవార్త

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
 
మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ టోర్నమెంట్ యొక్క ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. 

జూలై 19: యూఏఈ  vs నేపాల్- మధ్యాహ్నం 2 గంటలకు 

     భారత్ vs పాకిస్థాన్-    సాయంత్రం 7 గంటలకు 

జూలై 20:    మలేషియా vs థాయిలాండ్- మధ్యాహ్నం 2 గంటలకు
 
     శ్రీలంక vs బంగ్లాదేశ్- సాయంత్రం 7 గంటలకు 

జూలై 21:    ఇండియా vs యూఏఈ - మధ్యాహ్నం 2 గంటలకు
 
     పాకిస్థాన్ vs నేపాల్-    సాయంత్రం 7 గంటలకు
 
జూలై 22:    శ్రీలంక vs మలేషియా- మధ్యాహ్నం 2 గంటలకు
 
     బంగ్లాదేశ్ vs థాయిలాండ్- సాయంత్రం 7 గంటలకు

జూలై 23:    పాకిస్థాన్ vs యూఏఈ- మధ్యాహ్నం 2 గంటలకు

     భారత్ vs నేపాల్- సాయంత్రం 7 గంటలకు

జూలై 24:    బంగ్లాదేశ్ vs మలేషియా-    మధ్యాహ్నం 2 గంటలకు

     శ్రీలంక vs థాయిలాండ్-    సాయంత్రం 7 గంటలకు

జూలై 26:    సెమీ ఫైనల్ 1- మధ్యాహ్నం 2 గంటలకు

     సెమీ ఫైనల్ 2-    సాయంత్రం 7 గంటలకు

జూలై 28:    ఫైనల్: సాయంత్రం 7 గంటలకు