- మ. 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
దంబుల్లా (శ్రీలంక) : డిఫెండింగ్ చాంపియన్ ఇండియా విమెన్స్ ఆసియా కప్‌లో ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టింది. మెగా టోర్నీలో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అజేయంగా ఫైనల్‌కు వచ్చిన ఇండియా ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్, సెమీస్‌లో చూపెట్టిన జోరును ఆఖరాటలోనూ కొనసాగించి ఎనిమిదో ట్రోఫీతో తన రికార్డును మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేస్తూ టోర్నీని ఆరంభించిన ఇండియా మిగతా మ్యాచ్‌ల్లో యూఏఈ (78 రన్స్‌తో), నేపాల్ (82 రన్స్‌తో), బంగ్లాదేశ్ (10 వికెట్లతో) జట్లపై అలవోక విజయాలు సాధించింది.
టాపార్డర్ బ్యాటర్లు ఫుల్ ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో స్పిన్నర్లు, పేసర్లు చెలరేగిపోతున్నారు. అదే ఊపును మరొక్క మ్యాచ్‌లో కొనసాగిస్తే ఇండియాకు తిరుగుండదు. మరోవైపు ఇండియా మాదిరిగా శ్రీలంక కూడా అజేయంగా ఫైనల్‌కు వచ్చింది. ఆ టీమ్ కెప్టెన్ చామరి ఆటపట్టు 243 రన్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. అయితే, లంక బౌలర్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. దాంతో ఫైనల్లో ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.