మహిళల ఆసియా కప్‌లో హ్యాట్రిక్ విక్టరీ సాధించిన టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్–ఎ చివరి మ్యాచ్‌లో 82 రన్స్ తేడాతో నేపాల్ జట్టును చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్ గా నిలిచింది. ఇదే గ్రూప్ లో పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో 2 మ్యాచ్ లు గెలిచి మరో సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. గ్రూప్ బి లో శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి అగ్ర స్థానంలో ఉంటే.. బంగ్లాదేశ్ రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచి సెమీస్ కు చేరుకుంది.
రూల్స్ ప్రకారం గ్రూప్ ఏ లో టాపర్ గా నిలిచిన జట్టు గ్రూప్ బి లోని రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడాలి. అదే విధంగా గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ బి లో అగ్ర స్థానంలో నిలిచిన జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. దీని ప్రకారం భారత్ బంగ్లాదేశ్ తో.. శ్రీలంక బంగ్లాదేశ్ తో సెమీ ఫైనల్లో తలపడాల్సి ఉంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఇండియాతో బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడతాయి.
భారత్, బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ మధ్యాహ్నం 2 గంటలకు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సెమీ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఫైనల్ ఆదివారం (జూలై 28) జరుగుతుంది. 8 జట్ల మధ్య మహిళల ఆసియా టోర్నీ నిర్వహించగా.. నేపాల్, యూఏఈ, థాయిలాండ్,మలేసియా జట్లు ఇంటిదారి పట్టాయి. వీటిలో థాయిలాండ్, నేపాల్ ఒక మ్యాచ్ లో గెలిస్తే.. యూఏఈ, మలేసియా ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయాయి.