ఆశా వర్కర్స్ ఘటనపై రిపోర్ట్ ఇవ్వండి;..పోలీసులకు మహిళ కమిషన్ ఆదేశం

ఆశా వర్కర్స్ ఘటనపై రిపోర్ట్ ఇవ్వండి;..పోలీసులకు మహిళ కమిషన్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్స్ పై పోలీసులు ప్రవర్తించిన తీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద మంగళవారం ఆదేశించారు. మహిళ కార్మికులను గౌరవించడం తమ బాధ్యత అని ట్వీట్ లో చైర్ పర్సన్ పేర్కొన్నారు. ఇటీవల తమ సమస్యలు పరిష్కరించాలని కోఠి డీఎంఈ ఆఫీస్ దగ్గర వందలాది మంది ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. అనంతరం కోఠి మెయిన్ రోడ్డుపై బైఠాయించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ  సమయంలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి.