
ఇండియాలోనే తొలిసారిగా రైల్వే శాఖ వినూత్న ఆలోచనతో మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసింది. ట్రైన్ నడిపే లోకో పైలట్ నుంచి సిగ్నల్ కంట్రోల్, టీసీ తదితర సిబ్బంది మొత్తం మహిళలే ఉండేలా ప్లాన్ చేసింది. వందే భారత్ ట్రైన్ ఈ అద్భుత ఘటనకు కేంద్రం అయ్యింది.
శనివారం (మార్చి 8) మహిళా వుమెన్స్ డే సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసింది రైల్వే విభాగం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ టెర్నినల్ నుంచి షిరిడి కి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ (22223) ను మొత్తం మహిళా స్టాఫ్ ఆపరేట్ చేయడం విశేషం.
మహిళలకు ఇండియన్ రైల్వేస్ లో అత్యున్నత గౌరవం, సులభతరమైన బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందని, ట్రైన్ మొత్తం మహిళా స్టాఫ్ మెయింటైన్ చేయడం నారీ శక్తికి నిదర్శనమని ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా అన్నారు.
‘‘ఇవాళ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొత్తం మహిళా స్టాఫ్ తో నడవడం చాలా గొప్ప విషయం. ఇది చారిత్రాత్మకమైన, గర్వకారణమైన సందర్భం’’ అని సెంట్రల్ రైల్వేస్ ట్వీట్ చేసింది.
మహిళా సాధికారత సాధించేందుకు ఇండియన్ రైల్వేస్ తోడ్పాటు అందిస్తుందని, మహిళల డెడికేషన్, లీడర్ షిప్ ను ఇవాళ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అని ట్వీట్ లో పేర్కొంది.