ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘనకీర్తీ : మంత్రి సీతక్క

ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘనకీర్తీ : మంత్రి సీతక్క

ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘనకీర్తి అన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు.మార్చి 8న మహిళా దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ లో ని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు పలువురు మంత్రులు, మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. 

600 ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లు చేశామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా 115 కోట్ల మంది మహిళలు ప్రయాణించారన్నారు. 31 జిల్లాల్లో మహిళా పెట్రోల్ బంక్ లకోసం ఒప్పందం జరిగిందన్నారు. 

ALSO READ | చాకలి ఐలమ్మ వర్శిటీలో చదివిన ప్రతి బిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలి : సీఎం రేవంత్ రెడ్డి

గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాల సభ్యులకు ప్రమాదబీమా, రుణబీమా కల్పించామన్నారు. పది లక్షల ప్రమాద బీమా , రెండు లక్షల వరకు లోన్ బీమా ఇస్తున్నట్లు మంత్రి సీతక్క  చెప్పారు. మహిళలకోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు దీవించాలని కోరారు. 

మహిళల అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంటే.. కొంతమంది ఓర్వలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు.