జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సందడిగా విమెన్స్ డే

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సందడిగా విమెన్స్ డే

హైదరాబాద్​సిటీ: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో శుక్రవారం నిర్వహించిన విమెన్స్​డే వేడుకలు సందడిగా సాగాయి.  డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, కమిషనర్ ఇలంబరితితో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కేక్​కట్​చేసి వేడుకలను ప్రారంభించారు. 

మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. ఆటల పోటీలు, ర్యాంప్​వాక్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 30 సర్కిళ్లలో ఉత్తమ సేవలు అందించిన మహిళా శానిటరీ వర్కర్లను మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ సన్మానించారు. 

పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అడిషనల్ కమిషనర్లు పంకజ, సుభద్రాదేవి, అలివేలు మంగతాయారు, సరోజ, గీతా రాధిక, జాయింట్ కమిషనర్ ఉమా ప్రకాష్, సీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.