స్వశక్తితో మనల్ని మనమే రక్షించుకోవాలి:మహిళలకు సరోజావివేక్ పిలుపు

స్వశక్తితో మనల్ని మనమే రక్షించుకోవాలి:మహిళలకు సరోజావివేక్ పిలుపు

రంగారెడ్డి:సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను మహిళలు స్వశక్తితో తమను తాము కాపాడుకోవాలని  విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్ పిలుపునిచ్చారు. నిజాంపేటలోని సప్తపది గార్డెన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సరోజావివేక్..తల్లి ఒడి పిల్లలకు మొదటి బడి..చిన్న తనం నుండే వారికి అన్నితానై నేర్పించాలని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించి శభాష్ అనిపించుకోవాలని సూచించారు.మహిళా దినోత్సవం సందర్భంగా సరోజావివేక్ ని ఘనంగా సత్కరించారు నల్లమల్లి ఆదర్శ మహిళా ట్రస్ట్ సభ్యులు.  

అంతకుముందు నల్లమల్లి ఆదర్శ మహిళా  చారిటబుల్ ట్రస్ట్  ఫౌండర్, ఛైర్ పర్సన్ నల్ల మల్లి  సామ్రాజ్య లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  తెలంగాణ సంస్కృతి సారధి ఛైర్మెన్ వెన్నల గద్దర్ ని సౌమ్రాజ్యా లక్ష్మి, విశాఖ ఇండస్ట్రీస్ మానేజింగ్ డైరెక్టర్  సరోజ వివేక్ సత్కరించారు. అనంతరం వివిధ డిపార్టుమెంట్లలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఆదర్శ మహిళా అవార్డులను ప్రదానం చేశారు సరోజావివేక్.

ALSO READ | తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి.. పార్లమెంట్లో ప్రశ్నించాలి: భట్టి విక్రమార్క

వెన్నెల గద్దర్ మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో ఉద్యమాలకు వెన్నెముక మహిళలు అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంనుంచి తెలంగాణ ఉద్యమం వరకు మహిళ పాత్ర ప్రత్యేకం అని అన్నారు.