లవ్​ ఫర్ కౌ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ..మార్చి 2న లష్కర్​లో మహిళా దినోత్సవం

లవ్​ ఫర్ కౌ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ..మార్చి 2న లష్కర్​లో మహిళా దినోత్సవం
  • మహిళలకు అవార్డుల ప్రదానం
  • పోస్టర్​ను ఆవిష్కరించిన సరోజ వివేక్​

పంజాగుట్ట, వెలుగు:‘లవ్​ ఫర్ ​కౌ’​ ఫౌండేషన్​ఆధ్వర్యంలో సికింద్రాబాద్​లోని గుజరాతీ స్కూల్​లో మార్చి 2న మహిళా దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్ర మంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్​ను కాకా డాక్టర్ ​బీఆర్ ​అంబేద్కర్​ కాలేజీల కరస్పాండెంట్​సరోజ వివేక్ గురువారం ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవుల కోసం లవ్​ఫర్ ​కౌ ఫౌండేషన్​ చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. వారు నిర్వహించనున్న మహిళా దినోత్సవానికి మహిళలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ చైర్మన్​జస్మత్​పటేల్​ మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ , సమాజంలో వారి వృత్తిని కొనసా గిస్తున్న మహిళలకు గోరత్న, మహిళా రత్న, వైద్య రత్న, సమాజ రత్న అవార్డులు ఇవ్వబోతున్నట్టు తెలిపారు.