హైదరాబాద్ పోలీసు కమిషనర్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు అధికారులు. మొట్టమొదటిసారిగా మహిళా సీఐకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళా సిఐ మధులతకు SHOగా బాధ్యతలు అప్పగించారు. హోమ్ మంత్రి మహమూద్ అలి, నగర సిపి సీవి ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా సీఐకి మధులతకు బాధ్యతలు అప్పగించారు. మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పి ఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా మధులత బాధ్యతలు స్వీకరించారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి వీడియో విడుదల చేసిన జెలెన్ స్కీ
మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరం