కర్నూలు :తాగునీటి కోసం కర్నూలు కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా చేశారు మహిళలు. రెండు రోజులకోసారి గంటసేపు నీటిసరఫరపై ఆందోళన చేపట్టిన స్థానికులు.. పాతబస్తీ నుండి ఊరేగింపుగా వచ్చి ధర్నా చేపట్టారు. వస్తున్న ఆ నీళ్లు కాస్తా బురదతో కలుషితం కావడంతో రోగాలబారిన పడుతున్నామని చెప్పారు.
నీళ్లు సరిపోవనడం లేదంటే .. రెండు రోజులకోసారి ఒక్కో వార్డుకు ఒక్కో ట్యాంకర్ మాత్రమే పంపిస్తున్నారని..ట్యాంకర్ల దగ్గర రోజూ కొట్లాటలేనని ఆవేధన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం.. బాధ్యతా రాహిత్యమే పరిస్తితే నీటి కష్టాలకు కారణం అన్నారు. రెండు రోజుల్లో తాగునీటి సరఫరా చేయకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.