రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో 191 కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో 191 కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించామని కలెక్టర్ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో 240 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ముస్తాబాద్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ --యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ తలారి రాణి, డీఆర్డీవో శేషాద్రి, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వసంత లక్ష్మి, మేనేజర్ రజిత, తహసీల్దార్ సురేశ్‌‌‌‌‌‌‌‌, ఎంపీడీవో బీరయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ 

ఎరువుల విత్తనాల షాపులు మహిళా సంఘాలకు కేటాయిస్తామని కలెక్టర్ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా అన్నారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆయన అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించి ఎరువులు విత్తనాల షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎరువులు విత్తనాల షాపులు నడిపే వారికి బీఎస్సీ అగ్రికల్చర్  లేదా డిప్లొమా, సొంత/ అద్దెకు తీసుకున్న గోదాంలు ఉండాలన్నారు. రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్​బేగం, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, ఏపీఎంలు  పాల్గొన్నారు.