రాజ్‌గిర్ : ఈ సీజన్లో అంతగా రాణించలేకపోతున్న ఇండియా విమెన్స్ హాకీ టీమ్ సొంతగడ్డపై అచ్చొచ్చిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)కి సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మరోసారి విజేతగా నిలవడమే లక్ష్యంగా ఇండియా ఫేవరెట్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగుతోంది.
సోమవారం జరిగే తొలి మ్యాచ్‌లో తమకంటే తక్కువ ర్యాంకర్ మలేసియాపై నెగ్గి శుభారంభం చేయడంతో పాటు కొత్త ఒలింపిక్ సైకిల్‌ను ఘనంగా మొదలెట్టాలని చూస్తోంది. ఏడు ఎడిషన్లలో ఇండియా 2016, 2023లో విజేతగా నిలిచారు.