నవంబర్‌‌ 4 నుంచి మహిళల ఐపీఎల్‌‌ !

న్యూఢిల్లీ: అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్‌‌ 4- నుంచి 9వ తేదీ వరకు యూఏఈ వేదికగా మహిళల ఐపీఎల్‌‌ జరగనుంది. ‘మహిళల ఐపీఎల్‌‌కు సంబంధించిన డేట్స్‌‌ ఫైనలయ్యాయి. నవంబర్‌‌ 4–9 తేదీల్లో టోర్నీ జరుగుతుంది. సింగిల్‌‌ రౌండ్‌‌ రాబిన్‌‌ లీగ్‌‌ విధానంలో ట్రయల్‌‌ బ్లేజర్స్‌‌, వెలాసిటీ, సూపర్‌‌ నోవాస్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్‌‌తో కలిపి మొత్తం నాలుగు మ్యాచ్‌‌లు ఉంటాయి.  నవంబర్‌‌ 9న ఫైనల్‌‌ జరుగుతుంది.  మెన్స్‌‌ లీగ్‌‌ ఫైనల్‌‌తో క్లాష్‌‌ అవ్వకూడదని, మహిళల ఈవెంట్‌‌ను స్పెషల్‌‌గా ఉంచాలని ఈ డేట్స్‌‌ ఫిక్స్‌‌ చేశాం.  అక్టోబర్‌‌  రెండో వారంలో ప్లేయర్లు యూఏఈ వచ్చే చాన్సుంది. ఆరు రోజుల క్వారంటైన్‌‌ తర్వాత.. నెట్‌‌ ప్రాక్టీస్‌‌కు వాళ్లకి తగినంత టైమ్‌‌ ఉండేలా ప్లాన్‌‌ చేస్తున్నాం’ అని ఓ అధికారి చెప్పారు. కాగా,  ఇప్పుడున్న హెల్త్‌‌ సేఫ్టీ కారణాల వల్ల లీగ్‌‌లో  ఫారిన్‌‌ ప్లేయర్లు ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఇండియన్‌‌ గర్ల్స్‌‌కు మంచి చాన్స్‌‌ దొరకనుంది.

For More News..

ఎవరు పడితే వాళ్లతో ఆస్తుల సర్వే

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయలేం

ఎలక్షన్ల గురించి నేనట్లా అనలే..