మోడరేట్ డ్రింకింగ్ హ్యాబిట్.. అంటే ఓ మోస్తరుగా ఆల్కహాల్ తీసుకోవడం. ఈ హ్యాబిట్ మంచిదా? కాదా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. మంచిదని కొన్ని పరిశోధనలు.. అస్సలు మంచిది కాదని ఇంకొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుండగానే రీసెర్చర్లు ఇప్పుడు మరో విషయాన్ని చెప్తున్నారు.
ఆడవాళ్లు ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని వాళ్లంటున్నారు. హాంకాంగ్ లో సుమారు40 వేల మందిపై ఫ్యామిలీ కోహోర్ట్ అనే సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ సహకారంతో ఒక స్టడీని నిర్వహించింది. సుమారు నాలుగేళ్లపాటు ఈ స్టడీ కొనసాగింది. అసలు ఆల్కహాల్ తీసుకోని ఆడవాళ్లలో మెంటల్ హెల్త్ లెవెల్ ఎక్కువ (పాజిటివ్) ఉంది. ఈ నాలుగేళ్లలో మోడరేట్ డ్రింకింగ్ హ్యాబిట్ ను మానేందుకు ప్రయత్నించిన వాళ్లలోనూ లెవెల్స్ పెరిగాయి. కానీ, రెగ్యులర్ గా తీసుకుంటున్నవాళ్లలో మాత్రం నెగెటివ్ రిజల్ట్ కనిపించింది. అయితే మగవాళ్లలోనూ ఇది పాజిటివ్ రిజల్ట్ చూపించినప్పటికీ, ఆడవాళ్లతో పోలిస్తే తక్కువగా ఉందని రీసెర్చర్లు చెప్తున్నారు. కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ఈ రిపోర్ట్ పబ్లిష్ అయ్యింది.