పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్న మహిళలు

 పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్న మహిళలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు తమకు అందడం లేదని పెద్దపల్లి జిల్లాలో మహిళలు ఆగ్రహం  వ్యక్తం చేశారు.  పెద్దపల్లిలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఇళ్ల తాళాలు పగులగొట్టి  మహిళలు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణం పూర్తి అయినా.. ప్రభుత్వం పంపిణీ చేయడం లేదన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు ప్రభుత్వం ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు మహిళలకు సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.