WPL షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచులో RCB వర్సెస్ గుజరాత్ ఢీ

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) షెడ్యూల్ విడుదల అయ్యింది. టోర్నీ పూర్తి షెడ్యూల్‎ను బీసీసీఐ గురువారం (జనవరి 16) ప్రకటించింది. 2025, ఫిబ్రవరి 14వ తేదీ నుండి డబ్ల్యూపీఎల్ షూరు కానుంది. 2025 మార్చి 15న  ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‎లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. బరోడాలో కొత్తగా నిర్మించిన BCA స్టేడియంలో లీగ్ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. 

 డబ్ల్యూపీఎల్ థర్డ్ ఎడిషన్ మొత్తం నాలుగు వేదికల్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వడోదర, బెంగళూరు, లక్నో,  ముంబై వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచులు మాత్రం ముంబైలో జరుగుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. డబ్ల్యూపీఎల్ టైటిల్ కోసం ఈ సారి మొత్తం 5 జట్లు 22 మ్యాచుల్లో తలపడనున్నాయి. 

ALSO READ | Team India: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్

స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2024 సీజన్‌ డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచులో ఢిల్లీని చిత్తు చేసి ఆర్సీబీ తొలిసారి  టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ సీజన్‎లో కూడా స్మృతి మంధాన నేతృత్వంలోనే ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. లెజెండరీ ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెక్ లానింగ్ ఈ సీజన్‎లో కూడా ఢిల్లీ కెప్టెన్‎గా వ్యవహరించనుంది. అలిస్సా హీలీ యూపీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనుంది. ముంబై కెప్టెన్సీ బాధ్యతలను ఇండియా స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మోయనుంది. 

పూర్తి షెడ్యూల్ ఇదే: